తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు…

తెలువారందరి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లిన వారందరూ ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే భోగి, మకర సంక్రాంతి, కనుమగా ఇలా మూడు రోజులు పండుగను అత్యంత వైభవోపేతంగా తెలుగువారందరూ జరుపుకుంటారు. అయితే నేడు భోగి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో వేకువజామునే భోగి మంటలు వేశారు.

దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ శోభను సంతరించుకుంది. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటల దగ్గర పిల్లలు, పెద్దల కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. భోగి మంటల వద్ద చిన్నారులు కోలాటలతో ఆడిపాడారు. హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది.

Related Articles

Latest Articles