భీం భీం భీమ్లా నాయక్… దడదడదడ లాడించే డ్యూటీ సేవక్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా యాక్షన్ థ్రిల్లర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. ఇది 2020లో వచ్చిన మలయాళం హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వరుసగా రవి కె. చంద్రన్, నవీన్ నూలి నిర్వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని 12 జనవరి 2022 న విడుదల చేస్తున్నారు.

Read also : “భీమ్లా నాయక్”కు ఫ్యామిలీ స్టార్స్ విషెస్

ఇక నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా “భీమ్లా నాయక్” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఎంట్రీ, యాక్షన్ ప్యాక్డ్ టీజర్ మెగాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో వారు ఈ సాంగ్ గురించి కొన్ని రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. “భీం భీం భీం భీం భీమ్లానాయక్… దంచి దడదడదడ లాడించే డ్యూటీ సేవక్…” అంటూ సాగుతున్న ఈ సాంగ్ అదిరిపోయిందని చెప్పాలి. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related Articles

Latest Articles

-Advertisement-