సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ గిఫ్ట్ అదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సురుడెవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అన్ని కుదిరినట్లయ్యితే ఈ సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ సందడి చేసేవాడు. కానీ, కరోనా మహమ్మారి మరోసారి ప్రజలపై దాడి చేయడంతో ఈ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. అయినా సంక్రాంతికి అభిమానులను మాత్రం సంతోషపర్చనున్నారట మేకర్స్.

ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూడడం.. వాయిదా పడితే ఫీల్ అవ్వడం జరుగుతన్న క్రమంలో సంక్రాంతికి భీమ్లా నాయక్ టీజర్ ని రిలీజ్ చేసి అభిమానులను ఉత్సాహపరచనున్నారట మేకర్స్. అందుతున్న సమాచారం బట్టి ఇప్పటికే టీజర్ విడుదలకు సంబంధించిన అన్ని పనులను మేకర్స్ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి గిఫ్ట్ గా సినిమాను రిలీజ్ చేయకపోయినా కనీసం టీజర్ ని అయినా రిలీజ్ చేస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles