చివరి షెడ్యూల్ లో ‘భీమ్లా నాయక్’!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.. కరోనా వేవ్ తరువాత స్పీడ్ అందుకున్న షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరులో చివరి షెడ్యూల్ కానున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయాలతోనూ బిజీగా ఉండటంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఇప్పటికే పవన్ కు సంబందించిన ప్రధాన పార్ట్ ను పూర్తిచేసుకున్నాడు. రానా – సంయుక్త మీనన్‌ సన్నివేశాలను తెరకెక్కించాల్సి వుంది. ఈ చిత్రం షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సూర్య దేవర నాగ వంశీ నిర్మాతగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ సంభాషణలు & స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

-Advertisement-చివరి షెడ్యూల్ లో ‘భీమ్లా నాయక్’!

Related Articles

Latest Articles