‘రాధే శ్యామ్‌’తో మెగా క్లాష్‌… తగ్గేదే లే అంటున్న స్టార్స్

సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ ఫైట్ అనేది ఏ భాష అయినా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు మరో భారీ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతోంది. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్స్ తగ్గేదే లేదంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. భీమ్లా నాయక్, రాధే శ్యామ్ రెండు చిత్రాలూ ఒకరోజు గ్యాప్ తో ఒకేసారి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు ‘రాధే శ్యామ్‌’తో క్లాష్ కాకుండా ఉండడానికి సినిమా విడుదల తేదీని వాయిదా వేయవచ్చని చాలా ఊహాగానాలు వచ్చాయి. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మాత్రం తాము ‘భీమ్లా నాయక్’ను రంగంలోకి దించడంలో ఏమాత్రం వెనుకాడేది లేదంటూ మరోసారి సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. వచ్చే ఏడాది 12న ఈ సినిమా విడుదల కానుంది. రెండు రోజుల తర్వాత జనవరి 14న ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు ‘రాధేశ్యామ్’ విడుదల కూడా వాయిదా పడవచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మరి ‘రాధేశ్యామ్’ వెనకడుగు వేస్తాడా ? లేదంటే ‘భీమ్లా నాయక్’లాగా సినిమా విడుదల తేదీని మరోసారి ఖరారు చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సంక్రాంతి బరిలో తగ్గేది ఎవరు ? నెగ్గేది ఎవరు అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Read Also : హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ

Related Articles

Latest Articles