టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే…

టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అని తెలిపారు భట్టి విక్రమార్క. ఆరేళ్లలో ఆరు కోట్లు అప్పు చేసింది తెరాస. ఈటల నన్ను కలిసినప్పుడు జరుగుతున్న అవమానం పై అన్ని పార్టీల కలుస్తా అన్నారు. కేంద్రంతో రక్షణ పొందుదాం అని బీజేపీ లోకి కొందరు వెళ్తున్నారు. టీఆర్ఎస్ తో పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేది కాంగ్రెస్ మాత్రమే అని పేర్కొన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ కి ఫిర్యాదులు చేశాం. మా పిటిషన్ పెండింగ్ లో పెట్టీ..12 మంది పార్టీ లో చేరిన తర్వాత ఆ పిటిషన్ పై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానంలో కేసు ఉంది. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది. పోలీసులను అడ్డుపెట్టుకుని అరెస్టులు చేసింది. ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రజలను చైతన్యం చేయడమే అన్నారు. నిధులు.. నీళ్ల దుర్వినియోగం.. పొరుగు రాష్ట్రం దొచుకుపోతుంటే పట్టించుకో లేని ఈ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్పితే… అభివృద్ధి లేదు అని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-