ప్రభుత్వం భూములు అమ్మితే…అడ్డుకుంటాం : కాంగ్రెస్ వార్నింగ్

భూములు అమ్మాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సమైక్య రాష్ట్రంలో భూముల కోల్పోయాం అనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో దోపిడీ జరిగింది.. నేను కూడా అలాగే చేస్తా అంటే ఎలా ? అని ప్రశ్నించారు. జనం నిన్ను కూడా అలాగే సాగనంపుతారని కెసిఆర్ ను హెచ్చరించారు. అప్పులు ఓ వైపు..భూముల అమ్మకం ఇంకో వైపు రాష్ట్రాన్ని దివాలా తియించడమే అని.. భూముల అమ్మకాన్ని నిలిపి వేయాలని భట్టి డిమాండ్ చేశారు. అమ్మకానికి పెట్టిన భూములు.. అప్పుల వివరాలు జనం ముందు పెట్టాలని..గవర్నర్ ను కలిసి… భూముల అమ్మకాలు ఆపాలని సిఎల్పీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మొండిగా భూములు అమ్మితే… వేలం అడ్డుకుంటామని..భూముల అమ్మకానికి ఎవరూ రావొద్దని హెచ్చరించారు.

2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని… మీరు కొంటె…మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇస్తామన్నారు భట్టి. ప్రజల అవసరాల కోసం ఆస్తులు… అంతే కానీ అమ్మకానికి కాదన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఆస్తుల అమ్మకం సరికాదని… తెలంగాణ వచ్చింది.. ఆస్తులు కాపాడటం కోసమేనని పేర్కొన్నారు. Trs కూడా భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిందని..అప్పుడు వ్యతిరేకించి…ఇప్పుడు ఎలా అమ్మకాలను ఎలా ప్రోత్సహిస్తుందని ఫైర్ అయ్యారు. సిఎస్ సోమేష్ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని.. అందుకే ఆయనకు ఇక్కడి భూముల మీద ప్రేమ ఉండదన్నారు. మా రాష్ట్రం భూముల మీద మాకు ప్రేమ ఉంటుందని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-