రాష్ట్రంలో మరణాలకు కారణం సీఎం కేసీఆరే…

రాష్ట్రంలో భయంకర పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఇండియా నుండి వచ్చే వారిని రానివ్వటం లేదు అని భట్టి విక్రమార్క సీఎల్పీ నేత అన్నారు. గతేడాది దీపాలు పెట్టండి చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని చెప్తారు. ఇంట్లో దీపం ఆర్పేసి భయట దీపాలు పెట్టండి అంటారు. వ్యాక్సిన్ కూడా లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి తీరు కూడా అలాగే ఉంది అని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని మరణాలకు కారణం సీఎం కేసీఆరే కారణం. కరోనా దెబ్బ తిన్న కుటుంబాలకు ఉచిత వైద్యం,ఆర్థిక సహాయం అందించాలి. శాసన మండలి, సభలో కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్చండి అని చెప్తే ఒప్పుకున్నారు. 9 నెలలు అవుతున్న ఇప్పటికి అమలు కాలేదు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదు. ప్రజల్ని గాలికొదిలేశారు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-