ధాన్యం రోడ్ల మీద ఉంది..వెంటనే కొనాలి: భట్టి విక్రమార్క

ధాన్యం రోడ్ల మీద ఉందని దాన్ని వెంటనే కొని రైతుల ఇబ్బందులను తీర్చానలి కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు.నీళ్ల పంచాయతీని కేంద్ర, రాష్ర్ట ప్రభు త్వాల సమస్యల లెక్కన చూస్తున్నారు. దీనిపై అసలు ఏం జరుగు తుందో కేంద్రానికి, రాష్ర్టానికి మధ్యన జరుగుతున్న చర్చల సారాం శం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ స్పష్టతను ఇవ్వాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కొనక పోతే కేంద్రంతో తేల్చుకునే లోపు ఇక్కడ రైతులు నష్టపోతారని ఆయన అన్నారు. వడ్లు ముందు కొను.. దళిత బంధు ఎన్నికల వెంటనే మొదలు పెడతాం అన్నారు. ఇంకా ఎందుకు ప్రభుత్వం మొదలు పెట్టలేదో సమాధానం చెప్పాలన్నారు.

మా దగ్గర ఇంకా సర్వే మొదలు కాలేదు.. ఏం చేస్తారో చూడాలి అని భట్టి విక్రమార్క అన్నారు. అమరులైన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడాని స్వాగతిస్తున్నాము. ఢిల్లీలో అమ రులైన రైతులకు ఇచ్చినట్లే తెలంగాణ సాధనలో అమరులైన కుటుం బాలకు న్యాయం చేస్తానని ఏడున్నర ఏళ్ళు అవుతున్నా న్యాయం చేయలేదని ఆయన మండిపడ్డారు. 12వందల మంది అమరులకు న్యాయం చేస్తామంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవ తీర్మా నం చేశాం. ఇప్పటిక వరకు అమరుల కుటుంబాలకు ఉద్యోగం- 10 లక్షలు- డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ఇవ్వలేదు. రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలా? వద్దా? అంటూ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం పై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషం. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి- అమిత్ షాను కలువగానే యూ టర్న్ అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పై యుద్ధమే అని మళ్లీ అమిత్‌షాను కలుస్తా అంటున్నారు. ఇప్పుడు కూడా యూటర్న్‌ తీసుకుంటారా అంటూ భట్టి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి యుద్ధం అని ఢిల్లీ లో ఉన్నాడు, రాష్ట్రం లో ధాన్యం కొనేవారు లేరు దీని ఎవ్వరూ బాధ్యులో చెప్పాలని భట్టి విక్రమార్క విమర్శించారు. ఇప్పటికైనా రాష్ర్టంలో ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని భట్టి కోరారు.

Related Articles

Latest Articles