రాష్ట్రంలో తుగ్లక్ పాలన.. భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణలో కేసీఆర్ పాలనపై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఖాళీగా వున్ర పోస్టు లను భర్తీ చేయకుండా బదిలీల చేయడమేమిటని అన్నారు. మూడున్నర లక్షల ఉద్యోగ వ్యవస్థ ను అగమ్యగోచరంగా తయారు చేశారు. స్థానికత ను ప్రధానంగా తీసుకోకుండా బదిలీలు చేశారన్నారు. స్థానికత కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయింది.

ఉద్యోగం చేస్తున్న భార్య కేసులను కూడా పట్టించుకోక పోవడం దారుణం. అనారోగ్యం ఉన్న వారిని పట్టించుకోకుండా బదిలీలు చేశారు. మారుమూల ప్రాంతాలకు బదిలీలు చేశారు. ఖమ్మం జిల్లల వారికి ఆదిలాబాద్ కు పోస్టింగ్ ఎలా ఇస్తారు? హేతు బద్ధత లేని బదిలీలు చేశారని, ఉద్యోగులను భయాందోళనకు ప్రభుత్వం గురిచేస్తోందన్నారు భట్టి. తెలంగాణ కోసం 52 రోజుల పాటు సమ్మె చేసిన ఉద్యోగులతో కనీసం చర్చించలేదు.

హక్కుల కోసం తుగ్లక్ పాలనపై ఉద్యోగుల సంఘాలు పోరాడాలి. రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేయండి. ఉద్యోగుల సంక్షేమం కోసం పోరాడాలి.. పాలకుల సంక్షేమం కోసం కాదన్నారు. ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగ సంఘాలు వదిలేశాయి ఉద్యోగ సంఘం నేతలు పట్టించుకోకుంటే.. ఉద్యోగ సంఘాల వారు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది, ఉద్యోగ సంఘం వారితో కలిసి పోరాటం చేస్తామన్నారు భట్టి విక్రమార్క.

Related Articles

Latest Articles