ఆ జీవో ఎలా తీసుకొస్తారు: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై ఆయన స్పందించారు. 317జీవో తెచ్చి ఉద్యోగులను గందరగోళానికి గురిచేశారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కనీసం ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించకుండా జీవో ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఖాళీలను నింపి ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని సూచించారు.

Read Also: ఎల్బీనగర్ లోటస్ ఆస్పత్రిలో దారుణం

ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని చెప్పారు. 317 జీవోను తక్షణమే రద్దు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో మహబూబాబాద్‌ జిల్లాలో జేత్‌రాం అనే ఉపాధ్యాయుడు మరణించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఉద్యోగులతో చర్చించిన తరువాతే బదీలీల ప్రక్రియను చేపట్టాలని భట్డి విక్రమార్క డిమాండ్ చేశారు.

Related Articles

Latest Articles