రేవంత్… పీసీసీ గా సక్సెస్ కావాలి : భట్టి

కొత్తగా ఎంపికైన తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సోనియా గాంధీ నిర్ణయం తో పిసిసి గా రేవంత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారని.. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ గా సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వనరులు దోపిడీకి గురి అవుతుందని… సోనియా గాంధీ ఆశించిన లక్ష్యాలు అమలు కావడం లేదన్నారు.

read also : కేబినెట్‌ విస్తరణకు వేళాయె..! నేతల ఢిల్లీ బాట

కాంగ్రెస్‌ లక్ష్య సాధన కోసం కలిసి కట్టుగా నడుం బిగించి పోరాడాలని పేర్కొన్నారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్ కి పర్యాయ పదం మల్లు కుటుంబమని.. సోనియా గాంధీ ఏ ఆలోచనతో తెలంగాణ ఇచ్చారో… ఆ లక్ష్య సాధనకు పని చేస్తామన్నారు. బడుగు..బలహీన వర్గాల అభివృద్ధికి పని చేస్తామని..ఇద్దరం కలిసి కట్టుగా పని చేస్తామని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-