పంజాబ్ రాజకీయాల పై భట్టి విక్రమార్క కామెంట్స్…

32శాతం దలితులు ఉన్న రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసిన ఘనత రాహుల్, సోనియా గాంధీ లదే అని భట్టి విక్రమార్క అన్నారు. దళిత సీఎం ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే అమరేందర్ సింగ్ ను బీజేపీ నేతలు ఢిల్లీ కి పిలుపించుకున్నారు.. దళిత తుడికి సీఎం ఇవ్వడాన్ని అందరూ స్వాగతించాలి… కానీ పంజాబ్ లో రాజకీయ సంక్షోభం వచ్చినట్లు గా చూపెట్టడం సరైంది కాదు. దీన్ని నేను ఖండిస్తున్నా అని అన్నారు. ఇది సిద్దూ, అమరేందర్ సింగ్ అంతర్గత వ్యవహారం కాదు. దళితుడిని సీఎం చేయాలనుకున్నారు..చేసారు అంతే. చెప్పింది చేస్తారు అనే మాటకు కట్టుబడి రాహుల్, సోనియా కట్టుబడి దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అని తెలిపారు. ప్రతి రాజకీయ నాయకుడు ఈ నిర్ణయాన్ని సమర్దించాలి. కానీ పంజాబ్ లో మా పార్టీ ని చీల్చే ప్రయత్నం అమిత్ షా చేయడం సరైంది కాదు. అయితే దళితుడిని ముఖ్యమంత్రి చేయడం బీజేపీ కి ఇష్టం లేదు అని పేర్కొన్నారు.

-Advertisement-పంజాబ్ రాజకీయాల పై భట్టి విక్రమార్క కామెంట్స్...

Related Articles

Latest Articles