రామ్ మూవీ సెట్ లో భారతీరాజా బర్త్ డే సెలబ్రేషన్స్

నేడు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన నటుడిగానూ కొన్ని చిత్రాలలో నటించి మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. దాంతో భారతీరాజా బర్త్ డే వేడుకలను రామ్ సినిమా షూటింగ్ సెట్ లో జరిపారు దర్శకుడు లింగుస్వామి. ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రామ్ సినిమా షూటింగ్ స్పాట్ కు ప్రతిరోజూ ఎవరో ఒక అతిథి వస్తూనే ఉన్నారు. ఆ మధ్య ప్రముఖ దర్శకుడు శంకర్ రాగా, ఇవాళ భారతీరాజా విచ్చేశారు. ఈ రకంగా రామ్ మూవీ టీమ్ ప్రముఖులతో ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం కలుగుతోంది. భారతీయ సినిమాను కొంత పుంతలు తొక్కించిన దక్షిణాది దర్శకులలో భారతీరాజా కూడా ఒకరు. తమిళంలో అనేక చిత్రాలను తెరక్కించిన ఆయన తెలుగులోనూ ‘కొత్త జీవితాలు’, ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ వంటి చిత్రాలను రూపొందించారు. దర్శకుడిగా చిత్రరంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీతోనూ గౌరవించింది.

రామ్ మూవీ సెట్ లో భారతీరాజా బర్త్ డే సెలబ్రేషన్స్
రామ్ మూవీ సెట్ లో భారతీరాజా బర్త్ డే సెలబ్రేషన్స్
రామ్ మూవీ సెట్ లో భారతీరాజా బర్త్ డే సెలబ్రేషన్స్
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-