బ్రేకింగ్‌: కొవాగ్జిన్ ధ‌ర కూడా త‌గ్గింది

రాష్ట్రాల‌కు ఉప‌శ‌‌మ‌నం క‌లిగిస్తూ నిన్న సీరం.. త‌న వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధ‌ర‌లు త‌గ్గించ‌గా.. ఇప్పుడు.. భార‌త్ బ‌యోటెక్ సంస్థ కూడా గుడ్ న్యూస్ చెప్పింది.. రాష్ర్టాల‌కు అందించే కొవాగ్జిన్ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది.. కొవాగ్జిన్ ఒక్క డోసును రూ. 400కే స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కాగా, గ‌తంలో ఒక్క డోసును రూ. 600గా నిర్ధారించిన భార‌త్ బ‌యోటెక్.. ఇప్పుడు ఏకంగా ఒక్క డోసుపై రూ. 200కు త‌గ్గిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అయితే, కోవిషీల్డ్ టీకా ధ‌ర‌ను సీరం సంస్థ.. రూ. 400 నుంచి రూ. 300కు త‌గ్గించ‌గా.. కొవాగ్జిన్ రూ.200 త‌గ్గించి.. రూ.400గా నిర్ణ‌యించింది. ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వానికి డోసును రూ.150కే అందించాయి రెండు సంస్థ‌లు.. రాష్ట్రాల‌కు మాత్రం ఎక్కువ ధ‌ర నిర్ణ‌యంచ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. ఈ విష‌యంలో కేంద్రాన్ని టార్గెట్ చేశాయి అన్ని రాష్ట్రాలు.. ఈ నేప‌థ్యంలో.. రెండు సంస్థ‌ల‌కు లేఖ‌లు రాసిన కేంద్రం.. వ్యాక్సిన్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని కోర‌గా.. వ‌రుస‌గా రెండు సంస్థ‌లు త‌మ వ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను త‌గ్గించి రాష్ట్రాల‌కు ఊర‌ట క‌లిగించాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-