భానుశ్రీ ప్రధాన పాత్రలో ‘సర్వే నెం.3’ చిత్రం

‘బిగ్‌బాస్’ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో డి. రామకృష్ణ (ఆర్.కె) దర్శకత్వంలో మేకా హేమసుందర్ (మేకా ప్రసాద్) నిర్మిస్తోన్న చిత్రం ‘సర్వే నెం.3’. ఓ ప్రముఖ హీరో గెస్ట్ పాత్రలో నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి నిర్మాతలు డి. నరేందర్, బెల్లంకొండ సురేష్ హాజరై చిత్రయూనిట్‌ను ఆశీర్వదించారు.
నిర్మాత మేకా హేమసుందర్ మాట్లాడుతూ.. ‘ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు రెండో సినిమా. ఈ కరోనా టైమ్‌లో అసలు సినిమా నిర్మించాలని అనుకోలేదు. కానీ ఈ స్టోరీ విన్నాక ఎంతో ఎగ్జయిట్ అయ్యాను. ఖచ్చితంగా ఈ కథను ప్రేక్షకులకు అందించాలని అనిపించింది. అందుకే ఈ మూవీ స్టార్ట్ చేశాను. కథకు అనుగుణంగా ఆర్టిస్ట్‌లు కూడా చక్కగా కుదిరారు. ప్రముఖ హీరో ఈ చిత్రంలో గెస్ట్‌గా నటించనున్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే తెలియజేస్తాము’’ అని అన్నారు. భానుశ్రీతో పాటు దిల్ రమేష్, విజయ్, రమణారెడ్డి, ఇంతియాజ్, రాజేష్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-