మోస్ట్ పవర్ ఫుల్ వాటర్ ఫాల్స్ ఆడవాళ్ళ కన్నీళ్ళు: భాగ్యరాజ్

ప్రముఖ తమిళ దర్శకుడు భాగ్యరాజ్ తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ లాంటి పలు అద్భుతమైన కోణాలు కూడా ఉన్నాయి. తమిళ, తెలుగు, హిందీ చిత్రాలకు రచన, దర్శకత్వం చేసిన భాగ్యరాజ్ ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఆయన తాజాగా తన సతీమణి పూర్ణిమా జయరాంతో కలిసి ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా లాక్ డౌన్, ఈ సమయంలో ఫ్యామిలీతో గడపడం వంటి విషయాలను పంచుకున్నారు.

Read Also : స్వరబ్రహ్మ పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’ పాట

చాలామంది స్టార్ హీరోలతో స్క్రిప్ట్ రైటర్ గా పని చేశారు. అయితే కమల్ హాసన్ కు, రజినీకాంత్ కు మధ్య తేడా ఏంటి? అంటూ ఆయనను ప్రశ్నించగా… కమల్ లో యాక్టింగ్ మాత్రమే లేదని, ఆయనలో రైటర్, డైరెక్టర్ కూడా మిళితమై ఉన్నారని, ఆయనకు అన్ని విషయాలపై చాలా నాలెడ్జ్ ఉందని వెల్లడించారు. ఇక రజినీకాంత్ విషయానికొస్తే ఆయన సినిమాలో తన క్యారెక్టర్ ఏంటి? ఏంటి? ఏం చేయాలి ? అనే దానిపై మాత్రమే దృష్టి పెడతారని అన్నారు. ఇక వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ మోస్ట్ పవర్ ఫుల్ వాటర్ ఫాల్స్ ఆడవాళ్ళ కన్నీళ్ళు అని, మగాళ్లకు కోపం వస్తే అరుస్తామని, కానీ ఆడవాళ్లకు కోపం వస్తే కన్నీళ్లు చాలని అన్నారు. కానీ తన భార్య తనకు దేవుడిచ్చిన కానుక అంటూ పూర్ణిమపై ప్రశంసలు కురిపించారు. పూర్ణిమ కూడా అదే భావాన్ని వ్యక్తపరుస్తూ ఆయనకు షార్ట్ టెంపర్ ఎక్కువని వెల్లడించింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఇంటర్వ్యూ ప్రోమోను మీరు కూడా వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-