గణేష్‌ ఉత్సవాలు.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటన..

వినాయక ఉత్సవాలు, నిమజ్జనానికి హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది.. అయితే, గణేశ్‌ ఉత్సవాల నిర్వాహణపై తెలంగాణ, నిమజ్జనం పై ఆంక్షలు విధించింది హైకోర్టు.. ఈ నేపథ్యంలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావ్.. హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా తమకు అందలేదన్న ఆయన.. ఈ సారి సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.. ఈ నెల 19న సామూహిక నిమజ్జనం ఉంటుందని.. హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరగుతుందన్నారు.. ఇది ప్రజల కార్యక్రమం, ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంది… అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇక, గణేష్ మండపాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.. మరోవైపు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహాలు తయారీకి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది.. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నారు భగవంత రావ్.

కాగా, గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనంపై ఆంక్షలు విధించింది తెలంగాణ హైకోర్టు.. తమ ఆంక్షలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్‌ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని… హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని స్పష్టం చేసింది.. ఇక, హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రబ్బరు డ్యాంలోనే నిమజ్జనం చేయాలని పేర్కొంది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని పేర్కొంది హైకోర్టు. దీంతో.. నిమజ్జన కార్యక్రమం ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-