ద్విభాషా చిత్రంగా ‘భగత్ సింగ్ నగర్’

రమేష్ ఉడత్తు, గౌరి వాలాజా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘భగత్ సింగ్ నగర్’. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. వాలాజా క్రాంతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విదార్థ్, ధృవీక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య ప్రధాన పాత్రధారులు. ‘భగత్ సింగ్ నగర్’ అనేది ఓ అందమైన ప్రేమకథా చిత్రమని, భగత్ సింగ్ రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలకు అన్వయిస్తూ, కమర్షియల్ హంగులతో ఈ సినిమా తీస్తున్నామని దర్శకులు తెలిపారు. ఈ నెల 12న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నాట్టు నిర్మాతలు చెప్పారు. డి. ప్రభాకర్ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజేశ్‌ పీటర్, కళ్యాణ్ సమి ఛాయాగ్రాహకులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-