16 ఏళ్ల తర్వాత ‘భద్ర’ కాంబినేషన్?

16 ఏళ్ల క్రితం వచ్చిన ‘భద్ర’ సినిమా అప్పుడో సంచలనం.. బోయపాటి-రవితేజ కాంబోలో వచ్చిన ఈ చిత్రం పవర్​ఫుల్​ యాక్షన్​ అండ్ లవ్ రొమాంటిక్ ‘గా ఘన విజయం సాధించింది. బోయపాటికి తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా ప్రతిభ కనబరిచారు. అయితే దాదాపు 16 ఏళ్ల తర్వాత బోయపాటి-రవితేజ కాంబినేషన్ నుంచి మరో సినిమా రాబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమా షూటింగ్ చివరికి దశకు చేరుకొంది. ఈ సినిమా తర్వాత బోయపాటి రవితేజతో సినిమా చేయడం దాదాపుగా ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఓ బడా నిర్మాత ఈ ప్రాజెక్టు టేకప్ చేయగా ఇప్పటికే రవితేజ ఒకే చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ.. ‘ఖిలాడి’లో నటిస్తుండగా త్రినాథరావు నక్కిన, శరత్​ మండవ దర్శకత్వంలో మరో రెండు చిత్రాలు చేయనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-