మీరు బ్రేకప్ నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలు

ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, వారి మధ్య ప్రేమ విఫలమైనప్పుడు, ఒకరిపై మరొకరు విశ్వాసం కోల్పోయినప్పుడు లవ్‌లో బ్రేకప్ వస్తుంది. అయితే చాలా మందికి బ్రేకప్ నుంచి బయటపడటం అనేది నరకంగా ఉంటుంది. ఒక్కోసారి బ్రేకప్ అయిన వ్యక్తికి ఇంకా రిలేషన్ కొనసాగించాలని కొందరు భావిస్తారు. ఇంకా వారితో స్నేహంగా ఉండాలని అనుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఆ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ వదిలేసి బయటకు రావాలి. అప్పుడే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. అయితే బ్రేకప్ నుంచి బయటపడేందుకు కొన్ని ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

1) మీపై మీరు శ్రద్ధ పెట్టండి: రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ అయిన తర్వాత మీతో మీరు కనెక్ట్ కావాలి. ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకుంటే మరో వ్యక్తితో రిలేషన్‌షిప్ ఎలా ఉండాలో గుర్తిస్తారు. విచారంతో మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మానేస్తే మీరు అందవికారంగా తయారవుతారు. అందువల్ల మీ అందంపై దృష్టి సారించాలి. అనంతరం మీకు ఎలాంటి వ్యక్తి భాగస్వామిగా కావాలి, వారితో ఎలాంటి రిలేషన్ షిప్ ఉండాలో తెలుసుకోండి. మీ బలాలు, బలహీనతలను గుర్తించండి. మీ గురించి మీకు బాగా తెలిసినప్పుడు మీకు ఎలాంటి వ్యక్తి కావాలో తెలుస్తుంది. ఒంటరితనం వల్ల ఎవరితో ఒకరితో రిలేషన్ షిప్‌లో ఉండాలనే భావనలోకి వెళ్లకండి. అలా చేస్తే మళ్ళీ అవే తప్పులు చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రిలేషన్ షిప్ నుంచి కాస్త విరామం తీసుకుని మీతో మీరు ఎక్కువ సమయం గడపండి.

Read Also: మగాళ్లు.. మీరు ఆ పని చేయండి.. అందులో తప్పేంలేదు

2) మీ కుటుంబంతో గడపండి: బ్రేకప్ తర్వాత ఎక్కువగా ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. ఆ ఒంటరితనంలో ఒక్కోసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అందువల్ల ఎక్కువగా ఒంటరిగా ఉండకుండా కుటుంబసభ్యులతో హాయిగా గడపండి. కుటుంబీకులతో సరదాగా ఉండేలా జోక్స్, కామెడీ వీడియోలు చూడండి. వారితో మీ బాధను చెప్పుకోండి. వారితో మీ బాధలను చెప్పుకోవడం వల్ల మీకు రిలీఫ్‌గా ఉంటుంది. వీలైతే వారి సలహాలను స్వీకరించండి. మీకు మంచిగా అనిపిస్తే ఆ సలహాలను ఆచరణలోకి పెట్టి చూడండి. అప్పుడు మీ జీవితంలో మార్పులు చోటుచేసుకోవచ్చు.

3) అన్నింటికీ సరే అనడం: రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు కంటే కూడా బ్రేకప్ తర్వాత ప్రవర్తన మారిపోతుంటుంది. ఆ సమయంలో మీరు అన్ని విషయాలకు అవును అనడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. పైగా మీరు వీలైనంత సర్దుకోవడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి నిజంగా ఇది మీకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. అలానే మీరు అనుక్షణం బాధ పడకుండా ఉండడానికి చూస్తూ ఉండండి. ఎందుకంటే గతాన్ని అలా తలచుకుంటూ ఉంటే ఏమీ రాదు. బంగారు భవిష్యత్తును అలా వదిలేయడం మంచిది కాదు.

4) సోషల్ మీడియా జోలికి వెళ్లకండి: కొన్ని సార్లు సోషల్ మీడియా వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. అలానే మీరు బ్రేకప్ అయిన వారి విషయాలు మీకు తెలియకుండా ఉండడానికి మీరు వాళ్ళను బ్లాక్ చేయండి. వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ నుంచి కూడా దూరంగా ఉండండి. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా మీకు వాళ్ళ విషయాలు తెలుస్తాయి. ఇది నిజంగా మీ గుండెను గుచ్చుతుంది. కాబట్టి వీలైనంత దూరంగా సోషల్ మీడియాకు ఉండండి. అలాగే మీరు ఎవరితో అయినా చాటింగ్ చేసేటప్పుడు బ్రోకెన్ హార్ట్స్ పెట్టడం వంటివి చేయకండి దీని వల్ల మీరు ఇతరుల ముందు చులకన అయిపోతారు. పైగా అందరూ కూడా మీకు వాళ్ళని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. అయినా అన్ని విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మంచిది కాదు.

5) కొన్ని లక్ష్యాలను పెట్టుకోండి: బ్రేకప్ సమయంలో ఒంటరిగా ఉంటే మనకు ఏమీ తోచదు. అందువల్ల కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీరు జీవితంలో ఎలాంటి లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారు? మీ కెరీర్‌ ఎలా సాగాలని మీరు కోరుకుంటున్నారు? మీ శరీరం ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి? ఇలాంటి విషయాల గురించి కొంచెం సమయం తీసుకుని ఆలోచించండి. మీ లక్ష్యాలను సాధించడానికి ఏం చేయాలో ఆలోచించండి.

Related Articles

Latest Articles