అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చిన బెల్లంకొండ హీరో

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. కర్నూలుకు చెందిన ఓ అభిమాని కొత్త ఇంటిని నిర్మించి, తన అభిమాన హీరోని గృహప్రవేశ వేడుకకు ఆహ్వానించాడు. సాధారణంగా తమ బిజీ షెడ్యూల్ కారణంగా హీరోలు ఇలాంటి ఆహ్వానాలను మన్నిస్తారని ఆశించరు. కానీ బెల్లంకొండ లాక్‌డౌన్‌లో కర్నూలుకు వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఆయనొక్కడే కాకుండా సాయి గణేష్, బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ పద్మలతో పాటు వెళ్లారు. ఆ అభిమానికి గోల్డ్ రింగ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సర్ప్రైజ్ ఆ అభిమానికి జీవితకాలం నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also : “పుష్ప” నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే ?

అయితే దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ “ఛత్రపతి” రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ “కర్ణన్” రీమేక్ లో నటించనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-