భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. ఒకే కుటుంబలో ఏడుగురు మృతి

భారీ వర్షాలు ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని పొట్టన బెట్టుకుంది.. కర్ణాటక రాష్ట్రం బెల్గాం తాలూకాలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బదల అంకాలగిలో భారీ వర్షాల కారణంగా ఓ ఇల్లు కూప్పకూలింది.. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు కన్నుమూశారు.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.. ఇక, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.. కాగా, ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు..

-Advertisement-భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. ఒకే కుటుంబలో ఏడుగురు మృతి

Related Articles

Latest Articles