‘కథలు చెబుతా’మంటోన్న హాలీవుడ్ స్టార్స్!

భారతదేశంలోనే కాదు ఒకప్పుడు ప్రపంచం అంతటా పిల్లలు కథలు వినేవారు! పెద్ద వాళ్లు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వారికి రకరకాల కహానీలు చెప్పేవారు! కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇండియాలో ఉన్న పరిస్థితే వెస్టన్ కంట్రీస్ లోనూ కనిపిస్తోంది. పిల్లలు స్మార్ట్ ఫోన్ లోనో, కంప్యూటర్ లోనో, టీవీలోనో తల దూర్చేస్తున్నారు. కథలు ‘వినటం’ పూర్తిగా పోయింది. కళ్లప్పగించి ‘చూడటం’ మాత్రమే మిగిలింది!

‘వినటం’ వల్ల పిల్లల్లో ‘ఊహా శక్తి’ పెరుగుతుంది. కానీ, ఆధునిక టెక్నాలజీ ‘బొమ్మల’ మాయాజాలంలో చిన్నారుల ఇమేజినేషన్ కిల్ చేసేస్తోంది. అందుకే, ఇప్పుడు మరోసారి హాలీవుడ్ సెలబ్రిటీలు పిల్లల చెవులకు వినోదాన్ని పంచే పనిలో పడ్డారు. వారి ఊహలకు రెక్కలు తొడిగేలా ఆస్కార్ విన్నర్స్ బరిలోకి దిగారు! ఇంటర్నేషనల్ క్రేజ్ ఉన్న టాప్ స్టార్స్ కథలు చెప్పటం మొదలు పెట్టారు….

Read Also : దిలీప్ విషయమై బీజేపీ పరువు తీసిన సొంతపార్టీ ఐటీ సెల్ అధిపతి!

‘టైటానికి’ బ్యూటీ కేట్ విన్స్ లెట్ తో బాటూ స్కార్లెట్ జోహాన్సన్, రేచల్ మెక్ యాడమ్స్, హ్యూ లారీ ‘ఆడిబుల్ డాట్ ఇన్’ వెబ్ సైట్ కి తమ గాత్రాన్ని అరువిచ్చారు. వారి మాటల్లో ఇప్పుడు పిల్లలు తమ ఫేవరెట్ క్లాసిక్ స్టోరీస్ ని వినవచ్చు! అంటే, పెద్దలు వీట్ని వినవద్దని కాదు… పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ ఆడియో స్టోరీస్ ని రికార్డ్ చేశారు. మీరూ వినాలనుకుంటే వినేసేయండి! ‘మటిల్డా’, ‘ద మ్యాజిక్ ఫింగర్’ స్టోరీస్ కేట్ నరేట్ చేసింది, ‘సిరిల్ బాన్ హ్యామీ, గ్రేట్ డ్రెయిన్ రాబరీ’ కథల్ని హ్యూ లారీ వినిపించాడు, కాగా… ‘యాన్ ఆఫ్ గ్రీన్ గ్యాబెల్స్’ రేచల్ మెక్ యాడమ్స్, ‘యాలిస్ ఇన్ వండర్ ల్యాండ్’ స్కార్లెట్ జోహాన్సన్ రికార్డ్ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-