విమానాలు లేకున్నా టర్కీలో పరిణీతి చోప్రా! ఫారిన్ బీచ్ లో విహారాలు…

లాక్ డౌన్ కష్టాలు సామాన్యులకే కాదు… సెలబ్రిటీలకు, వీఐపీలకు కూడా తప్పటం లేదు. ఎప్పుడూ విమానాల్లో చక్కర్లు కొట్టే సినిమా వాళ్లకైతే ఇంట్లో కూర్చోలేక విసుగొస్తోంది. కానీ, ఇలాంటి కరోనా కాలంలో కూడా బీ-టౌన్ బ్యూటీ పరిణీతి టర్కీలో ప్రత్యక్షమైంది. అదీ బీచులో ఉరువులు కనిపించేలా ఫోజులిస్తూ చూసేవార్ని ఊరించేస్తోంది! మరి సహజంగానే డౌట్ వస్తుంది కదా… ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్స్ పరిణీతీని అడగానే అడిగేశారు… ‘లాక్ డౌన్ కాలంలో దేశం నుంచీ ఎలా ‘ఫరార్’ అయ్యావ్?’ అని! పరిణీతి చోప్రా లాస్ట్ మూవీ ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’. నెట్ ఫ్లిక్స్ లో ఆ సినిమా రిలీజ్ అయ్యాక లీడ్ యాక్టర్స్ అర్జున్ కపూర్, పరిణీతికి మంచి మార్కులే పడ్డాయి. అయితే, ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ తరువాత ఎక్కడికో ‘ఫరార్’ అయిపోయిన మిస్ చోప్రా… ఎట్టకేలకు నెట్ లో ఫ్యాన్స్ కి అందుబాటులోకి వచ్చింది. టర్కీలోని బీచులో సేదదీరుతూ కొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ లైవ్ సెషన్ కూడా నడిపింది.

అయితే, అందులో అందరూ ఇండియా దాటి ఎలా వెళ్లావ్ అంటున్నారని… కాస్త క్లారిటీ ఇచ్చింది! పరిణీతి మార్చ్ నుంచీ ఇండియాలో లేదట! అందుకే, విదేశాల్లో విహరిస్తూ కరోనా కష్టాల్ని తప్పించుకుందట. అసలు ఆమె ‘’ఇన్ని నెలలుగా బయటేం చేస్తోంది?’’ లాంటి పర్సనల్ ప్రశ్నలు మనకెందుకుగానీ… జూనియర్ చోప్రా పోస్ట్ చేసిన టర్కీ ఫోటోల్లో ఒక దానికి సీనియర్ చోప్రా… ప్రియాంక జోనాస్… ‘ఐ యామ్ సో జెలస్’ అంటూ కామెంట్ చేసింది! ఇక అర్జున్ ‘బయట నుంచీ టఫ్ గా ఉంటాడుగానీ, లోలోపల చాలా సాఫ్ట్’ అన్న పరీ కామెంట్ కి మిష్టర్ కపూర్ ‘దట్ ఈజ్ ట్రూ’ అని స్పందించాడు. ‘బాబా అండ్ ఐ ఆర్ రెడీ ఫర్ ‘ఫరార్’ 2’ అని కూడా చెప్పిన పరిణీతి… అర్జున్ కపూర్ ని ట్యాగ్ చేసింది. చూడాలి మరి, ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్ 2’ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-