ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి 36 వేల కోట్ల ఆదాయం..?

ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీ 20 ఫార్మటు కు చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫార్మాట్ లో మన బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ఐసీసీ టోర్నీలకు కూడా అంతగా ఉండదు అనేది నిజం. అయితే 2008 లో ప్రారంభమైన ఐపీఎల్ లీగ్ యొక్క ప్రసార హక్కులు మొదట సోని తగ్గారా ఉన్నాయి. కానీ అప్పుడు వారు కుదుర్చుకున్న 10 ఏళ్ళ గడువు ముగిసిన తర్వాత 5 ఏళ్లకు స్టార్ స్పోర్ట్స్ బీసీసీఐ తో ఒప్పందం చేసుకుంది. ఆ సమయంలో స్టార్ స్పోర్ట్స్ 16 వేల కోట్లకు పైగా బీడ్ చేసి ఈ హక్కులు సంపాదించుకుంది. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ తో ఆ ఒప్పందం ముగియనుండటంతో… ప్రసార హక్కుల కోసం బీసీసీఐ మళ్ళీ వేలానికి ఆహ్వానించింది. అయితే దీని పై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ…. వచ్చే ఏడాది నుండి 10 జట్లు ఆడనున్నాయి. కాబ్బటి మ్యాచ్ లు పెరుగుతాయి. అలాగే వ్యూవర్ షిప్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ వేలంలో కనీసం 30 వేల కోట్ల నుండి 36 వేల కోట్ల వరకు ప్రసార హక్కులు వేలంలో వెలుతాయని తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వేలానికి బిడ్ వేసే అవకాశం ఈ నెల 24 వరకు ఉంది.

Related Articles

Latest Articles