ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు పెంచిన బీసీసీఐ…

భారత జాతీయ రంజీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లకు అలాగే డొమెస్టిక్ కెరియర్ లో 40 మ్యాచ్ లకు పైగా ఆడిన ఆటగాళ్లకు ఇక నుండి ఒక్కో మ్యాచ్ కు 60,000 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే అండర్ 23 ఆటగాళ్లకు 25,000 వేలు, అండర్ 19 ఆటగాళ్లకు 20,000 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో సీనియర్ ఆటగాళ్లకు రంజీ ట్రోఫీ లేదా విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో మ్యాచ్ 35,000 ఇస్తుండగా… సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ కోసం 17,500 మాత్రమే ఇచ్చేవారు. ఇక ఈ ఏడాది జరగాల్సిన రంజీ సీజన్ రద్దు కావడంతో.. గత రంజీ సీజన్ లో ఆడిన ఆటగాళ్లకు ఇచ్చే మ్యాచ్ ఫీజులు 50 శాతం అధికంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

-Advertisement-ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు పెంచిన బీసీసీఐ…

Related Articles

Latest Articles