లాఠీ గ్యాంగ్ లో నలుగురు అరెస్ట్

కనిపించిన వాళ్లని కనిపించినట్టు లాఠీలతో ఇరగ్గొడుతోన్న లాఠీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గ్యాంగ్ లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కొంతకాలంగా బాలాపూర్ షాహీన్‌నగర్ లో అర్ధరాత్రి లాఠీలతో విరుచుకుపడుతోంది ఒక గ్యాంగ్. అర్ధరాత్రి వేళ రోడ్ల మీద కనిపించిన వారిని కనిపించినట్టు లాఠీలతో బాదుతోందీ ముఠా. ఇటీవల ముఠా ఆగడాలు మరీ పెచ్చుమీరిపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా నలుగురు బాలాపూర్ బిస్మిల్లా కాలనీ వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్న వాళ్లని ఇమ్రాన్, ఇమ్రాన్ మహమ్మద్, షేక్ జిలాని, సయ్యద్ సమీర్ గా గుర్తించి అరెస్ట్ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-