‘బ‌తుకు బ‌స్టాండ్’ మూవీ నుంచి ‘బుస్సా బుస్సా’ సాంగ్!

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘బతుకు బస్టాండ్’. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐ.ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఐ. కవితారెడ్డి, కె. మాధవి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహవీర్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని మొదటి పాటను ఇటీవల విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. దాంతో ఈ రోజున మాస్ సాంగ్ ‘బుస్సా… బుస్సా’ను రిలీజ్ చేశారు. బ్రెజిలియన్ మోడల్ జెన్నీఫర్ పిక్కినాటో నటించిన ఈ ఐటమ్ సాంగ్ కూ సూపర్ రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు ఐ.ఎన్. రెడ్డి చెప్పారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని, అతి త్వరలోనే మూవీని జనం ముందుకు తీసుకొస్తామని అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-