ఈటల పార్టీ నుండి వెళ్లిపోతే ఎవరూ బాధపడటం లేదు…

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తు, గులాబీ జెండా గుర్తుతో గెలిచిన విషయాన్ని మంత్రి ఈటెల రాజేందర్ గుర్తుంచుకోవాలని… తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పని చేశారని… వారంత కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించారని పేర్కొన్నారు. అందులో ఈటెల ఒక్క కార్యకర్త మాత్రమే…టీఆర్ఎస్ పెట్టిన తర్వాత 2003 లో ఈటెల జాయిన్ అయ్యారని చురకలు అంటించారు. కేసీఆర్ తమ నాయకుడు అని.. ఆయన నాయకత్వంలో పని చేసేందుకు నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉన్నారన్నారు. ఈటెల పార్టీ నుండి వెళ్లి పోతే ఏ ఒక్క నాయకుడు బాధపడటం లేదని.. కారు గుర్తు, కేసీఆర్ ను నమ్ము కున్న వారు మాత్రమే టీఆరెఎస్ లో ఉంటారని పేర్కొన్నారు. ఈటెల పార్టీలోకి రాక ముందే నలుగురు ఎంపిపిలతో పాటు 80 శాతం మంది ఎంపీటీసీలు గెలిచారన్నారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ ఆరుకాల వీరేశలింగం మాట్లాడుతూ..ఈటెల అణిచివేత వల్లే నేను టీఆరెఎస్ పార్టీ వీడానని…ఇప్పుడు అతను బయటకు వెళ్లాడు కాబట్టి నేను పార్టీలోకి వచ్చానని వెల్లడించారు. సమావేశంలో మండల ఇంచార్జీ జీవి రామకృష్ణ రావు, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-