మొండి బకాయిలను బ్యాంకులు రికవరీ చేశాయి: ప్రధాని మోడీ

మొండి బకాయిలను చెల్లించని వారి నుంచి బ్యాంకులు సొమ్మును రికవరీ చేశాయని, వీటి విలువ రూ. 5 లక్షల కోట్లకు పైగా ఉంటుం దన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. “ఎవరైనా బ్యాంకు రుణాలు తీసుకుని పారి పోయినప్పుడు అందరూ చర్చించుకుం టారన్నారు. కానీ ధైర్యంగా ప్రభుత్వం వారి నుంచి తిరిగి తీసుకు వచ్చినప్పుడు, ఎవరూ దాని గురించి చర్చించరు” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. “మేము ఎన్‌పీఎల సమస్యను పరిష్కరించామన్నారు. బ్యాంకులకు రీక్యాపిటలైజ్ చేశామని తెలిపారు. ఇవే కాకుండా బ్యాంకుల బలాన్ని పెంచామని పేర్కొన్నారు. ఐబీసీ వంటి సంస్కరణలను తీసుకొచ్చామన్నారు.

ఇవే కాకుండా బ్యాకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొ చ్చామన్నారు. డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తున్నా మన్నారు. బ్యాంకుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందు తున్నాయన్నారు. ఇంకా చెల్లించని మొండి బకాయిలను సైతం చెల్లించేలా బ్యాంకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటాయని ఈ సంద ర్భంగా మోడీ అన్నారు. జన్‌ ధన్‌ యోజన ద్వారా పేదల ఆర్థిక పరిస్థి తి మెరుగుపడిందన్నారు. భారతదేశంలో సుమారు 42శాతం ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేవని ఈ పథకం ద్వారా వారు బ్యాంకింగ్‌ సేవలను పొందుతున్నారని మోడీ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles