న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించింది. విదేశాల్లో తొలిసారిగా టెస్టుల్లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.

Read Also: సామాన్యుడిపై మరో భారం… పెరిగిన సిమెంట్ ధరలు

తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 328 పరుగులు చేయగా.. కివీస్ బౌలర్లను ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ ధీటుగా సమాధానం ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 458 పరుగులు చేసి 130 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 169 పరుగులకే ఆలౌట్ చేసి విజయావకాశాలను సృష్టించుకుంది. 42 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు వెన్ను విరిచి 6 వికెట్లు సాధించిన ఎబాడట్ హుస్సేన్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టుకు ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి విజయం. గత 18ఏళ్లలో న్యూజిలాండ్ జట్టుపై టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విక్టరీ కావడం విశేషం.

Related Articles

Latest Articles