‘బంగార్రాజు’ ట్రైలర్ అప్డేట్… రివీల్ చేసేసిన నాగ్

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన “బంగార్రాజు” జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి, రమ్యకృష్ణ కథానాయికలుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నిన్న రాత్రి ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నాగార్జున, నాగచైతన్య, అమల, సుశాంత్, సుమంత్ లతో పాటు హీరోయిన్లు కృతి శెట్టి, దక్ష, ఫరియా అబ్దుల్లాతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. సినిమాలోని పాటలన్నీ హిట్ అయిన సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఇక వేడుకకు అభిమానులను ఆహ్వానించలేకపోవడం బాధగా ఉందన్న నాగార్జున కుదిరితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తామని అన్నారు.

Read Also : ఎవరి జీవితం పరిపూర్ణం కాదు… సామ్ @ డోర్ స్టెప్ మెంటల్ హెల్త్

ఇక ఇదే వేదికగా ‘బంగార్రాజు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ముందుగా ఈ నెల 11న ‘బంగార్రాజు’ ట్రైలర్ రిలీజ్ అవుతుందని ప్రకటించిన నాగార్జున, అక్కడే మరోమారు మేకర్స్ దగ్గర కన్ఫర్మ్ చేసుకుని మరీ ‘బంగార్రాజు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. దీంతో ఇప్పటి నుంచి అక్కినేని అభిమానులు ‘బంగార్రాజు’ ట్రైలర్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నీ అంచనాలను పెంచేశాయి. పండగ లాంటి సినిమా సంక్రాంతికి రాబోతోంది అని చెబుతున్న ‘బంగార్రాజు’కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles