వాసివాడి తస్సాదియ్యా.. చిన ‘బంగార్రాజు’ ఎంట్రీ అదిరిపోయిందిగా..

అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఎంతటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రం రాబోతుంది. ఇక ఈసారి ఈ చిత్రంలో అక్కినేని నవ మన్మథుడు నాగ చైతన్య నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్, పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా నేడు( నవంబర్ 23) నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా చైతూ లుక్ టీజర్ ని రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు. టీజర్ లో చైతూ ఎంట్రీ అదిరిపోయింది. బంగార్రాజు ఫోటో వద్ద ఉన్న కళ్ళజోడు,రింగ్స్, చైన్ వేసుకొని దసరా బుల్లోడుగా బైక్ పై బయల్దేరాడు చిన బంగార్రాజు.. పేరును బట్టి చైతూ బంగార్రాజు మనవడిగా కనిపించనున్నట్లు అర్ధమవుతుంది. అచ్చుగుద్దినట్లు తాత బంగార్రాజును కాపీ కొడుతున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతుంది.

Related Articles

Latest Articles