ప్రకాష్ రాజ్ 10 కోట్ల ఫండ్ తెస్తే.. నేను 11 కోట్లు తీసుకొస్తా: బండ్ల గణేష్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివాదాలు కూడా ఎక్కువే అవుతున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ విందు రాజకీయంపై బండ్ల గణేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటు కావాలంటే ఫోన్‌ చేసి.. మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో మీటింగులు పెట్టి.. ఒక చోట చేర్చి ప్రాణాలతో చెలగాటమడోద్దని అని బండ్ల గణేష్ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. ‘మీతోనే ఉంటానని ప్రకాష్ రాజ్ కు మాట ఇచ్చాను. అనుకోని వారు కొందరు వచ్చినందుకే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బయటకు వచ్చాను. అందుకే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా మాట్లాడాను. ప్రకాష్ రాజ్ 10 కోట్ల ఫండ్ తెస్తే.. నేను 11 కోట్లు తీసుకొస్తాను అని బండ్ల హాట్ కామెంట్స్ చేశారు.

ఇక జీవిత.. బండ్ల గణేష్ కు ఆన్సర్ ఇవ్వటం టైమ్ వెస్ట్ అన్న ఆమె కామెంట్స్ కు బండ్ల మరోసారి వ్యంగంగా సమాధానం ఇచ్చారు. జీవిత గూర్చి మాట్లాడే స్థాయి నాది కాదన్నారు బండ్ల. నావి చీప్ ట్రిక్స్.. వాళ్ళవి కాస్ట్ లీ ట్రిక్స్.. జీవిత ఎన్నిసార్లు పార్టీ మారితే నాకేంటి? ఝాన్సీ లక్ష్మిభాయి, మదర్ థెరిసా, జీవిత గురించి మాట్లాడే స్థాయి నాది కాదు’ అంటూ బండ్ల గణేష్ తెలిపారు. మరి ఆ పూర్తి ఇంటర్వ్యూపై ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Latest Articles

-Advertisement-