బండ్ల గణేష్ హీరో మూవీ షూటింగ్ షురూ!

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక – నిర్మాతలు మాట్లాడుతూ “తమిళ హిట్ చిత్రం ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి‌ రీమేక్ ఇది. తమిళంలో పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తాయి. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం” అని చెప్పారు. ఈ చిత్రానికి మరుధూరి రాజా మాటలు అందిస్తుండగా, లైనస్ మధిరి సంగీతం సమకూర్చబోతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-