రేవంత్ రెడ్డి డైనమిక్.. పవన్ సీఎం కావాలి: బండ్ల గణేష్

‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు బండ్ల గణేష్‌ తన మద్దతు యూటర్న్‌ తీసుకోవడంతో హాట్‌ టాఫిక్‌గా మారింది. జీవితా రాజశేఖర్ ఎంట్రీతో బండ్ల గణేష్ ఎగ్జిట్ అయ్యారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని బండ్ల గణేష్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇక ప్రస్తుతం రాజకీయాల గూర్చి మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి రావడంతో కాంగ్రెస్ లో తిరిగి పునర్వైభవం కనిపిస్తోందన్నారు. రేవంత్ డైనమిక్ లీడర్.. కాంగ్రెస్ పార్టీ ఓ సముద్రం.. చిన్న చిన్న లుకలుకలు చాలా సాధారణమన్నారు. ప్రస్తుత ‘మా’ లో ఉన్న చాలా మంది రాజకీయ పార్టీలో పనిచేసినవారే అని బండ్ల గణేష్ తెలిపారు.

ఇక జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గూర్చి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలనేది తన కోరిక అని బండ్ల గణేష్ తెలిపారు. పవన్ నాకు దేవుడితో సమానం కాబట్టే ‘పవనేశ్వరా’ అని పిలుస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాబట్టే జనసేనలోకి వెళ్లలేదన్నారు. పవన్ కోసం నేను ఏమి చేయలేకపోయినా నాకు జీవితాన్ని ఇచ్చారు. అందుకే ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది అంటూ బండ్ల గణేష్ తెలిపారు. మరి ఆయన పూర్తి ఇంటర్వ్యూపై ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Latest Articles

-Advertisement-