ఢిల్లీలో తెలంగాణ భవన్‌ దేని కోసం?-బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనే టార్గెట్‌గా విమర్శలు సంధించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. టీఆర్ఎస్‌తో బీజేపీ ఎప్పటికీ కలవదని స్పష్టం చేశారు. దళిత బంధులాగే.. బీసీ, గిరిజన బంధు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు టీ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. 10వ రోజు పాదయాత్ర కొనసాగించిన ఆయన.. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ దేని కోసం? ఎవరి కోసం కడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఎప్పుడు టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేయదన్నారు బండి సంజయ్‌. మతతత్వ పార్టీ ఎంఐంతోనే టీఆర్ఎస్‌ కలిసి పని చేస్తుందన్నారు. 80 శాతం మంది హిందువులున్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి.. దళిత బంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు సంజయ్‌. హుజురాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-