నోటితో మాట్లాడి…నొసటితో వెక్కిరించి నట్లు కెసిఆర్ హామీలు!

సమ్మె చేస్తున్న డాక్టర్లతో తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. డాక్టర్లకు కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. నోటితో మాట్లాడి …నొసటితో వెక్కిరించి నట్లు సిఎం కెసిఆర్ హామీలు ఉన్నాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీ అధికారుల్లో చిత్త శుద్ధి లేదు.. చెత్త శుద్ధి ఉందని మండిపడ్డారు. డాక్టర్లు చేస్తున్న న్యాయ బద్ద సమ్మెను పరిష్కరించాలని.. ప్రభుత్వం సమ్మె విషయంలో రెండు నాల్కల ధోరణి వీడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా డాక్టర్లతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కారించాలన్నారు బండి సంజయ్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-