కేంద్రం సీరియస్‌గా ఉంది.. ఎప్పుడైనా కేసీఆర్‌ జైలుకు వెళ్ళొచ్చు : బండి

మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఈ విషయములో కేంద్రం సీరియస్‌గా ఉందన్నారు. కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైందని, ఎప్పుడైనా కేసీఆర్‌ జైలుకి వెళ్ళొచ్చన్నారు. అంతేకాకుండా ఈ విషయం కేసీఆర్‌ కు తెల్సి పోయిందని, అందుకే కమ్యూనిస్టుల తోను, ఇతర పార్టీల నేతల తో భేటీ అవుతున్నాడని విమర్శించారు. తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పసుగ్రాసం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని, కేసీఆర్‌ కూడా జైలుకు వెళ్తే ఎలా వుంటుందో.. తేజశ్వి యాదవ్ నిన్న ప్రగతి భవన్ కు వచ్చి వివరించి ఉంటాడని ఎద్దేవా చేశారు.

కేంద్రం జైలుకు పంపుతుందనే కమ్యూనిస్టులు, విపక్ష నేతలు కేసీఆర్‌ను పరామర్శించేందుకు వస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపుతే సానుభూతి కోసం కూడా కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నడని ఆరోపించారు. ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. దోచు కోవడం దాచుకోవడమే… కేసీఆర్ పని. కేసీఆర్‌ను ఎక్కడున్న గుంజుకొచ్చుడే…జైల్లో వేసుడే.. మరో వైపు 317 జీఓ సవరించాలని బీజేపీ చేస్తున్న పోరాటంని డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా కేసీఆర్‌ చేస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు.

Related Articles

Latest Articles