రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది నాలుగో స్థానం: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో దీక్ష చేస్తే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తున్నాడని.. తాము రైతుల కోసం ఆలోచిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Read Also: పల్లె దవాఖానాలపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

ఢిల్లీలో చనిపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ అంటున్నాడని… కన్నతల్లికి కోక కొనని వాడు.. పినతల్లికి బంగారు గాజులు పెట్టినట్టుంది కేసీఆర్ తీరు అని బండి సంజయ్ మండిపడ్డారు. దేశంలో రైతుల ఆత్మహత్యల అంశంలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది… 2019లో 419 మంది రైతులు, 2020లో 471 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. వీళ్లందరికీ కేసీఆర్ రూ.20 లక్షలు ఇస్తాడా? అని ప్రశ్నించారు. ప్రతి దానికి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ జోడిస్తాడని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు వాస్తవం కాదా? రైతుల ఇబ్బందులు వాస్తవం కాదా? అని నిలదీశారు. ధాన్యం తడిసినా, మొలకలు వచ్చినా వెంటనే కొనాలని… బోనస్ రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Related Articles

Latest Articles