నెల రోజులకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. మరో నాలుగు రోజుల్లో ఆయన మొదటివిడత యాత్ర ముగియనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పాల్గొన్న ఈ యాత్రలో.. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు సంజయ్. పార్టీ ఎక్కడ బలంగా ఉంది స్థానిక నాయకుల పరిస్థితి ఏంటీ అనే క్లారిటీకి వచ్చారు అవినీతి, నియంతృత్వం, కుటుంబపాలన నుంచి విముక్తి కోసమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్ట్ 28న ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు.

హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర హైద్రాబాద్, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల మీదుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. ఈ నెల రోజుల్లో రెండు రోజుల బ్రేక్ తప్ప మిగతా అన్ని రోజులు పాదయాత్ర జరిగింది. సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు, సెప్టెంబర్ 17 అమిత్ షా సభ రోజు ఆయన యాత్ర జరగలేదు. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వారి ప్రసంగాలు సాగాయి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, రమణ్‌సింగ్.. ఐదుగురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సంగ్రామ యాత్రలో భాగంగా ఇప్పటివరకు సుమారు నాలుగు వందల కిలోమీటర్లు నడిచారు బండిసంజయ్. దారి వెంబడి తనను కలిసిన వారితో మాట్లాడుతూ ముందుకు సాగారు. వివిధ వర్గాలవారు.. తమ సమస్యలను సంజయ్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన పలు అంశాలపై సీఎంకి లేఖ రాశారు. అక్టోబర్ 2తో సంజయ్ మొదటి విడత యాత్ర ముగియనుంది. ఉపఎన్నిక జరగాల్సి ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన ప్రజా సంగ్రామ యాత్రను భారీ రోడ్ షోతో ముగించాలని నిర్ణయించారు. ఈ ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నారు.

-Advertisement-నెల రోజులకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర

Related Articles

Latest Articles