హైకోర్టులో బండి సంజయ్‌ లంచ్‌మోషన్‌ పిటిషన్‌

ఈ నెల 2న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారనికై జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షకు అనుమతులు లేవని, కోవిడ్‌ నిబంధనలు ఉలంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసి మరుసటి రోజు కరీంనగర్‌ ఎక్సైజ్‌ కోర్టులో హజరుపరిచారు.

దీంతో కోర్టు బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆ సమయంలో బండి సంజయ్‌ తరుపు లాయర్‌ కోర్టులు బెయిల్‌ పిటిషన్‌ వేయడంతో దానిని కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టులో బండి సంజయ్‌ తరుపు లాయర్‌ బండి సంజయ్‌ రిమాండ్‌ను రద్దుచేయాలంటూ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే కాసేపట్లో బండి సంజయ్‌ పిటిషన్‌ విచారణకు రానుంది.

Related Articles

Latest Articles