తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే మొద‌టి సంత‌కం దానిమీదే…

తెలంగాణ‌లోని హుస్నాబాద్‌లో బండి సంజ‌య్ మొద‌టి విడ‌త పాద‌యాత్ర పూర్తైన సంద‌ర్భంగా భారీ స‌భ‌ను ఏర్పాటు చేశారు.  ఈ స‌భ‌కు కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ హాజ‌ర‌య్యారు.  ఈ స‌భ‌లో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఇది బీజేపీ స్వాగ‌త స‌భ అని, బీజేపీ అధికారంలోకి వ‌స్తే వైద్యం, విద్య విష‌యంలో మొద‌టి సంత‌కం చేస్తామ‌ని అన్నారు.  2023లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, అంద‌రికీ ఉచితంగా వైద్యం అందిస్తామ‌ని, స్కూళ్ల‌ను అభివృద్ధి చేస్తామ‌ని బండి సంజ‌య్ తెలిపారు.  36 రోజులపాటు, 348 కిమీ మేర పాద‌యాత్ర చేసిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  ల‌క్ష‌ల కోట్లతో ప్రాజెక్టులు ఎవ‌రికోసం క‌డుతున్నార‌ని, పాద‌యాత్రలో ఎవ‌ర్ని అడిగినా ఒక్క చుక్క‌నీరు కూడా రాలేద‌ని చెబుతున్నార‌ని, వ‌రిస్తే ఉరి ఎందుకు అని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు.  ఈనెల 30 వ తేదీన హుజురాబాద్‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న నేప‌థ్యంలో ఈ భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌డం విశేషం.  హుజురాబాద్‌లో త‌ప్ప‌కుండా గెలుస్తామ‌ని ఈట‌లతో పాటుగా బీజేపీ శ్రేణులు గ‌ట్టిగా న‌మ్ముతున్నాయి.  మ‌రి ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఏమున్న‌దో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.  

Read: ఎల్బీన‌గ‌ర్‌ను ఇండియా పాక్ స‌రిహ‌ద్దుల్లా మార్చారు…

-Advertisement-తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే మొద‌టి సంత‌కం దానిమీదే...

Related Articles

Latest Articles