మొన్ననే ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్.. నేడు తొలగించాడు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యలవల్ల గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న 1700 మంది నర్సులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం రోడ్డెక్కిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేయడం దారుణమని ఖండించారు.

Read Also: ‘విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్’… కాశ్మీర్ లో బాలీవుడ్ బ్యూటీ!

కరోనా కాలంలో ప్రాణాలకు ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు రోగులకు సేవలందిస్తూ మంచి పేరు సంపాదించిన నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే నజరానా ఇదేనా? అని మండిపడ్డారు. కనీస ముందస్తు సమాచారం లేకుండా నర్సులను ఉద్యోగుల నుండి తొలగించడం అన్యాయమన్నారు. వెంటనే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Read Also: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీంలో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్‌

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని మొన్ననే హామీ ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ ప్రభుత్వం నేడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూ బజారున పడేయడం శోచనీయమన్నారు. వైద్యశాఖ పటిష్టానికి తక్షణమే ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులుసహా పారా మెడికల్ పోస్టులన్నీ భర్తీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-