మాకు జైళ్లు కొత్తకాదు 9 సార్లు జైలుకి వెళ్లా: బండిసంజయ్‌

జైలు నుంచి విడుదలయిన తరువాత బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు చేశారు. ఈ మాకు జైళ్లు కొత్తకాదు 9సార్లు జైలుకి వెళ్లాను. నేను ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లాను. 317 జీవోను మాత్రం సవరించాలని మళ్లీ డిమాండ్‌ చేస్తున్నా అని బండి సంజయ్‌ అన్నారు. నీ సంగతెంటో తెలుస్తా.. ఉపాధ్యాయులు అందరితో చర్చించు వాళ్ళకి న్యాయం చేయ్‌ అంటూ కేసీఆర్‌ పై బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. మహిళలపై దాడి చేశారు. కార్యాలయం పైన హేయమైన చర్యకు పూనుకున్నారు. ఉపాధ్యాయులకు మేము అండగా ఉంటాం ఎవ్వరూ భయపడొద్దు. నేను జైలుకి పోయింది వేరు నువ్వు పోయేది వేరని బండి సంజయ్‌ హెచ్చరించారు.

Read Also: మత్స్యకారులు సామరస్యంతో ఉండాలి: మంత్రి అప్పలరాజు

ఉపాధ్యాయులు ఉద్యోగులు రైతులు కోసం నిరుద్యోగుల కోసం మళ్ళా జైలుకు వెళ్తా అంటూ వ్యాఖ్యానించారు. తూ బతుకు హై కోర్టు ఛీకొట్టింది.నా ఆఫీస్ బద్దలు కొడతావా.. ధర్మం కోసం పనిచేసే వ్యక్తులం మేము. బలి దానాలకు సిద్ధమైన పార్టీ మాది మీలాంటి తుప్పేలు పార్టీ కాదన్నారు. గ్యాస్ కట్టర్లతో ఆఫీస్‌ను బద్ధలు కొడతావా మహిళలపై ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా….? ప్రశ్నిస్తే జైలుకు పంపుతావా..? అవినీతి కుబేరుడు కేసీఆర్‌ నువ్వు అంటూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. హైకోర్టు నిన్నే తప్పుపట్టింది. విడుదల చేయమన్నా విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తావ్‌… కేసీఆర్‌ నీకు కృతజ్ఞతలు నువ్వు ఎంత క్రూరుడివో ప్రజలకు తెలిసింది. దమ్ముంటే ఉద్యోగులతో బయటకు వచ్చి మాట్లాడు.. నీ నీచపు చరిత్రకు చరమగీతం పాడతాం.. అంటూ కేసీఆర్‌ను హెచ్చరించారు. నాకు సహకరించిన జాతీయ నాయకులకు కార్యకర్తలకు అందరికి ధన్యవాదాలు.. తెలంగాణ సమాజానికి ఉపాధ్యాయ ఉద్యోగస్తుల ఆశీస్సులతో ముందుకు వెళ్తాం అంటూ బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈనెల 10న బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ ఆ బంద్‌ను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది.

Related Articles

Latest Articles