ఎంతో మంది ప్రాణత్యాగం.. వారి బలిదానాలు వృథా కానివ్వం..!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భావజాలం వ్యాప్తి కోసం, బీజేపీ జెండా ఎగరేయడానికి, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు.. వారి బలిదానాలను వృతా కానివ్వం అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… వేలాది మంది నక్సలైట్ల చేతిలో తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.. ఆ మహనీయుల బలిదానాలు వృథా కానివ్వం.. వారి స్ఫూర్తితో జాతీయవాద భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారాయన.. హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా మీడియా/సోషల్ మీడియా జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ జెండాను కచ్చితంగా ఎగురవేస్తామని ప్రకటించారు.. జాతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా, సోషల్ మీడియా వర్క్ షాపులో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సోదరీమణులకు స్వాగతం పలికిన ఆయన.. తెలంగాణ పవిత్ర క్షేత్రం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడానికి తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మస్వరాజ్ గారి కృషి ఎంతో ఉందని.. ఆమెను సదా స్మరించుకుంటాం అన్నారు.. ఆమెకు నివాళులర్పిస్తున్నాం.. వేలాది మంది బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని గుర్తుచేశారు.. ఈ రోజు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ వర్క్ షాపు ద్వారా ప్రేరణ, ఉత్సాహం కలుగుతోందన్నారు బండి సంజయ్‌.

Related Articles

Latest Articles

-Advertisement-