ఈటల రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి…

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం లో జెండా పండుగ కార్యక్రమం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మెజారితో గెలవడం ఖాయం. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఈటల మాటలకు స్పందించారు ప్రభుత్వం బాల్క సుమన్. ఈటల రాజేందర్ శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకోవడానికి మానసికంగా ఇప్పటి నుండే సిద్ధం కావాలి. దమ్ముంటే కేసీఆర్, హరీష్ రావు నామీద పోటీ చేయాలనే స్థాయి ఈటల రాజేందర్ కు లేదు అని తెలిపారు.

కేసీఆర్ ఆరు సార్లు టిక్కెట్లు ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు సార్లు మంత్రి గా చేశాడు. ప్రజాస్వామ్యం మీద ఈటలకు నమ్మకం ఉంటే మందు బాటిల్ పొట్టేళ్ల పంపకాలు ఆపాలి అన్నారు. చెప్పేటివి శ్రీరంగనీతులు చేసేది ఏమో అది అన్నట్టుంది అని పేర్కొన్నారు. ఆస్తులు కాపాడుకోవడానికి నీకు నువ్వు కాపాడుకోవడానికే బీజేపీ పార్టీలోకి చేరావు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి బిజెపి పార్టీ ని విమర్శించిన నువ్వు ఆ పార్టీలో ఎలా చేరావు అని ప్రశ్నించారు. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ నిన్ను ఖచ్చితంగా ఓడిస్తాడు. ఇక ఈటల రాజేందర్ అన్న మాటకు కట్టుబడి ఉండాలి ఎక్కడ వెనుకడుగు వేయకూడదు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని స్పష్టం చేసారు.

Related Articles

Latest Articles

-Advertisement-