12 గంటలకు మీడియా ముందుకు బాలయ్య..

ఏపీలో రాజకీయాల రోజురోజుకు మారుతున్నాయి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ నేతలు వ్యక్తిగతంగా, తన భార్య భువనేశ్వరీ సైతం విమర్శించారంటూ.. ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సభను నిష్ర్కమించారు. అయితే అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఒక్కసారిగా విలపించారు. దీంతో తమ అభిమాన నేతను కించపరిచేలా మాట్లాడారని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నిపుణులు, ప్రముఖులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. అయితే తాజాగా 12 గంటలకు మీడియా ముందు నందమూరి బాలకృష్ట రానున్నట్లు ప్రకటించారు. దీంతో బాలకృష్ణ ప్రెస్‌ మీట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన చంద్రబాబుకు మద్దతుగా ఏమైనా మాట్లాడుతా.. వైసీపీపైన ఆగ్రహం వ్యక్తం చేస్తారా..? అనే ప్రశ్నలు అందరిలోనూ నెలకొన్నాయి.

Related Articles

Latest Articles