మీరు మారక పోతే.. మెడలు వంచుతాం : బాలయ్య వార్నింగ్

చంద్రబాబు కంటతడి పెట్టిన ఘటన బాలయ్య కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు… మీడియా ముందుకు వ‌చ్చిన బాల‌య్య కుటుంబం… వైసీపీపై ఫైర్‌ అయింది. ప్రజా స‌మ‌స్యల‌పై చ‌ర్చించాల్సిన అసెంబ్లీలో క్యారెక్టర్ అస్సాసినేష‌న్ మంచిదికాదని మండిపడ్డారు బాలయ్య. గొడ్ల చావిట్లో ఉన్నామా, అసెంబ్లీలో ఉన్నామా అన్న అనుమానం క‌లుగుతోందని ఆగ్రహించారు బాల‌కృష్ణ. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్ని ఫైర్‌ అయ్యారు బాలకృష్ణ.

ఇకనైనా వైసీపీ తన పద్దతిని మార్చుకోవాలన్నారు. మీరు మారక పోతే.. మెడలు వంచుతామని బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట క్యారెక్టర్‌ అస్సాసియేషన్‌ మంచిది కాదన్నారు. అసెంబ్లీ వాగ్వాదాలు మామూలే కాని వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాప్రతినిధుల సంస్కారం కాదన్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, రాష్ట్ర విభజన తరువాత కూడా ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేశారన్నారు. కానీ ఇప్పుడు ఏం అభివృద్ధి జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.

Related Articles

Latest Articles